Nalgonda SLBC Tunnel Collapse, Three-Meter Roof Collapse(X)

Srisailam, FEB 23: నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్‌, హైడ్రా, సికింద్రాబాద్‌ బైసన్‌ డివిజన్‌ ఇంజినీరింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది.

Rahul Gandhi On SLBC Tunnel Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్‌ఎల్‌బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే  

ఇక టన్నెల్ లోపల చిక్కుకున్న వారు బతికే అవకాశం లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడం కష్టంగా ఉందన్నారు. టన్నెల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నీటి తీవ్రత ధాటికి టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ కొట్టుకొచ్చిందని చెప్పారు. 1 కిలో మీటర్ మేర నీరు, బురద ఉన్నాయని తెలిపారు.

Minister Jupally On SLBC Tunnel Rescue Operation

 

130 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 120 మంది ఎస్డీఆర్‌ఎఫ్‌, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్‌, 24 మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సొరంగంలో 13.5 కిలోమీటరు వద్ద పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్‌ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్‌లో 14వ కి.మీ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది. ఫిషింగ్‌ బోట్లు, టైర్లు, చెక్కబల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ వైద్య బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 8మంది బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌ సుఖేంద్‌ తెలిపారు.