Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిగా ఐదోసారి ఎన్నికైన షేక్ హసీనా.. ఎన్నికల సంఘం వెల్లడి
రికార్డు స్థాయిలో ఐదవసారి, వరుసగా నాలుగవసారి ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది.
Dhaka, Jan 8: బంగ్లాదేశ్ (Bangladesh) ప్రధానమంత్రిగా షేక్ హసీనా (Sheikh Hasina) మరోసారి ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో ఐదవసారి, వరుసగా నాలుగవసారి ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా కు చెందిన అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) (Bangladesh Nationalist Party) ఎన్నికలను బహిష్కరించడంతో అవామీ లీగ్ పార్టీ సునాయాసంగా గెలిచింది. కాగా ‘గోపాల్‌గంజ్-3’ నియోజకవర్గం నుంచి ప్రధాని షేక్ హసినా ఎనిమిదవసారి విజయం సాధించారు. 1986 నుంచి ఆమె ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)