Brazil: ముచ్చటగా మూడోసారి, బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా లులా డ సిల్లా ప్రమాణ స్వీకారం, బ్రెజిల్‌ను పునర్నిర్మిస్తానని హామీ

లులా మూడోసారి బ్రెజిల్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నడుమ లులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్‌ బోల్సోనారోపై విజయం సాధించారు.

Lula da Silva (Photo Credit: ANI)

బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా లులా డ సిల్లా (76) పదవీ ప్రమాణం చేశారు. లులా మూడోసారి బ్రెజిల్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నడుమ లులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్‌ బోల్సోనారోపై విజయం సాధించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడిగా బోల్సోనారో నాలుగేండ్ల పాటు కొనసాగారు.బ్రెజిల్‌ అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం అనంతరం లులా డ సిల్వా మాట్లాడుతూ.. బ్రెజిల్‌ను పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గత కొన్నేండ్లుగా కోల్పోయిన హక్కులు, స్వేచ్ఛ, అభివృద్ధిని మళ్లీ దక్కేలా కృషి చేస్తానన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)