China: వైరల్ వీడియోలు, చైనాలో కరోనా కల్లోలానికి జీరో కోవిడ్ విధానమే కారణమంటూ నిరసనలు, వెంటనే దాన్ని తీసేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన ప్రజలు
చైనాలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. రోజుకు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. చైనాలో రికార్డు స్థాయిలో ఆదివారం ఒక్కరోజే 40,347 కొవిడ్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది
చైనాలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. రోజుకు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. చైనాలో రికార్డు స్థాయిలో ఆదివారం ఒక్కరోజే 40,347 కొవిడ్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇందులో భాగంగా ‘జీరో కొవిడ్’ పాలసీని అమలు చేస్తూ లక్షల మంది ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షాంఘై నగరంలో వేల మంది చైనీయులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కొవిడ్ లాక్‌డౌన్‌ను అంతం చేయాలని నినాదాలు చేశారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఖాళీ కాగితాలు, రాత్రిపూట మొబైల్ ఫోన్ల ఫ్లాష్‌లైట్లను ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. వీరికి మద్దతుగా నెటిజన్లు సైతం ఖాళీ కాగితాల చిత్రాలను పోస్టులుగా పెడుతున్నారు. ఆందోళనకారులకు చెందిన వీడియోలు ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Here's Protest Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)