China Highway Collapse: వీడియో ఇదిగో, చైనాలో ఉన్నట్లుండి కుంగిపోయిన జాతీయ రహదారి, గోతిలో పడి 19 మంది వాహనదారులు మృతి

దీంతో హైవేపై భారీ గుంత ఏర్పడింది. రోడ్డుపై వేగంగా దూసుకెళుతున్న వాహనాలు ఆ గోతిలో పడిపోయాయి. దీంతో 19 మంది చనిపోయారు. సౌత్ చైనాలోని గ్వాంగ్ డాంగ్ సిటీ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మీజౌ, డాబు కౌంటీ ల మధ్య హైవే కూలిపోయింది.ఈ ప్రమాదంలో 18 వాహనాలు గోతిలో పడిపోయాయి

Highway Collapse in Southern China (Photo Credit: X/ @Uncensorednewsw)

చైనాలోని ఓ జాతీయ రహదారి ఉన్నట్టుండి కుంగిపోయింది. దీంతో హైవేపై భారీ గుంత ఏర్పడింది. రోడ్డుపై వేగంగా దూసుకెళుతున్న వాహనాలు ఆ గోతిలో పడిపోయాయి. దీంతో 19 మంది చనిపోయారు. సౌత్ చైనాలోని గ్వాంగ్ డాంగ్ సిటీ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మీజౌ, డాబు కౌంటీ ల మధ్య హైవే కూలిపోయింది.ఈ ప్రమాదంలో 18 వాహనాలు గోతిలో పడిపోయాయి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 50 అడుగుల లోతైన లోయలో పడిన ప్రైవేట్ బస్సు, ఆరు మంది అక్కడికక్కడే మృతి

అందులో ప్రయాణిస్తున్న పందొమ్మిది మంది చనిపోగా, 49 మంది గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో స్థానికులతో కలిసి మొత్తం 500 మందికి పైగా పాల్గొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడికి దగ్గర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)