China Restaurant Fire: షాకింగ్ వీడియో, రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం, భోజనానికి వెళ్లిన 17 మంది మృతి, చైనాలో విషాద ఘటన
ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగడంతో భోజనం చేసేందుకు వెళ్లిన వారితో పాటు మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు
చైనాలోని ఈశాన‍్య నగరం చాంగ్‌చున్‌లో బుధవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగడంతో భోజనం చేసేందుకు వెళ్లిన వారితో పాటు మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు సిబ్బంది.రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)