Gold Mine Collapse in Venezuela: వెనిజులాలో ఘోర ప్రమాదం, బంగారు గని కుప్పకూలడంతో 14 మంది మృతి, పలువురు ఇంకా శిథిలాల కిందనే..

సెంట్రల్ వెనిజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆంగోస్తురా మునిసిపాలిటీలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 14 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Mine Collapse (Representative Image)

Illegal gold mine collapses in Venezuela: సెంట్రల్ వెనిజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆంగోస్తురా మునిసిపాలిటీలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 14 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల్లో స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఇప్పటి వరకు 23 మంది మృతదేహాలను వెలికి తీశామని, మరో 11 మంది గాయపడినట్లు తెలిసిందని బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజెల్ మార్కానో అక్కడి మీడియాకు తెలిపారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై వెనిజులా ప్రెసిడెంట్ నికోల‌స్ మ‌దురో స్పందించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. శిథిలాల కింద ఉన్న‌వారిని గుర్తించి, ర‌క్షించాల‌న్నారు. సివిల్ డిఫెన్స్ బృందాలను ఇప్ప‌టికే పంపామ‌ని తెలిపారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement