Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు, వరుస భూకంపాలతో వణుకుతున్న తూర్పు ఆసియా దేశాలు

వరుస భూకంపాలతో తూర్పు ఆసియా దేశాలు విలవిలలాడుతున్నాయి. బుధవారం ఉదయం తైవాన్‌ (Taiwan)ను భారీ భూకంపం వణికించిన విషయం మరచిపోకముందే.. తాజాగా జపాన్‌లో శక్తివంతమైన భూకంపం (Japan Earthquake) సంభవించింది.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

వరుస భూకంపాలతో తూర్పు ఆసియా దేశాలు విలవిలలాడుతున్నాయి. బుధవారం ఉదయం తైవాన్‌ (Taiwan)ను భారీ భూకంపం వణికించిన విషయం మరచిపోకముందే.. తాజాగా జపాన్‌లో శక్తివంతమైన భూకంపం (Japan Earthquake) సంభవించింది. గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్‌-మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ (European-Mediterranean Seismological Centre) తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది.ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్‌ రాజధాని టోక్యో (Tokyo)లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.  భూంకంపం ధాటికి భారీ భవనాలు ఎలా కూలుతున్నాయో వీడియోలో చూడండి, తైవాన్ సునామి ధాటికి నేలకొరిగిన ఫ్లైఓవర్లు

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement