Earthquake in Turkey: అర్థరాత్రి గాఢనిద్రలో ఉండగా కంపించిన భూమి, పేకమేడల్లా కుప్పకూలిన బహుళంతస్థుల భవనాలు, ఇప్పటివరకు 500 మృతి చెందినట్లుగా వార్తలు

టర్కీ, సిరియాను భారీ భూకంపం అతలాకుతలం చేసేసింది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి మొత్తం 1700 బిల్డింగ్‌లకు పైగా ధ్వంసం అయ్యాయి. భారీ భూకంపం దాటికి 500 మందిదాకా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.వేల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Earthquake (Photo-ANI)

టర్కీ, సిరియాను భారీ భూకంపం అతలాకుతలం చేసేసింది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి మొత్తం 1700 బిల్డింగ్‌లకు పైగా ధ్వంసం అయ్యాయి. భారీ భూకంపం దాటికి 500 మందిదాకా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.వేల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ప్రజలు ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది.స్వల్ప వ్యవధిలో భారీగా రెండుసార్లు భూమి కంపించడం.. ఆ ప్రభావంతో రెప్పపాటులో పలు బహుళంతస్థుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.భూకంపం సమయంలో ఇళ్లు, బిల్డింగ్‌లు కూలిపోతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement