Earthquake in Afghanistan: ఆఫ్ఘానిస్థాన్‌‌లో మళ్లీ భారీ భూకంపం, ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

ఆప్ఘానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘానిస్థాన్‌ (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake)తో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటల సమయంలో బలమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

ఆప్ఘానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘానిస్థాన్‌ (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake)తో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటల సమయంలో బలమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. అక్టోబర్ నెలలో పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపంలో 2 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. వేలాది మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టమై ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now