Finland PM Sanna Marin: చిక్కుల్లో ఫిన్లాండ్​ ప్రధాని సన్నా మారిన్, ఫ్యామిలీ బ్రేక్​ఫాస్ట్ కోసం అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ఫిన్లాండ్​ ప్రధాని సన్నా మారిన్​ చిక్కుల్లో పడింది. ఫ్యామిలీ బ్రేక్​ఫాస్ట్ కోసం ఆమె నెలకు 300 యూరోల అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

Finland PM Sanna Marin (Photo Credits: Twitter)

ఫిన్లాండ్​ ప్రధాని సన్నా మారిన్​ చిక్కుల్లో పడింది. ఫ్యామిలీ బ్రేక్​ఫాస్ట్ కోసం ఆమె నెలకు 300 యూరోల అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫిన్లాండ్​ ప్రధాని సన్నా మారిన్​.. కెసరంటాలోని అధికారిక నివాసంలో కుటుంబంతో సహా ఉంటోంది.

అయితే బ్రేక్​ఫాస్ట్ కోసం నెలకు 300 యూరోలు(365 డాలర్లు) ఖర్చు అవుతున్నట్లు చూపిస్తూ.. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి ఆమె క్లెయిమ్​ చేస్తోంది. ఈ మేరకు లోకల్ టాబ్లాయిడ్​ ఒకటి కథనం ప్రచురించడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో సన్నా మారిన్ స్పందించారు. ఒక ప్రధానిగా తాను ఎలాంటి సౌకర్యాలు కోరుకోలేదని, అలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆమె ట్వీట్​ చేశారు.

కాగా, రీఎంబర్స్​మెంట్​ గురించి చట్టంలో ఎక్కడా లేదన్న పోలీసులు.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిన్నిష్​ చట్టాలకు విరుద్ధంగా సన్నా వ్యవహరించారని, ఆమె ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాగా, పోలీస్​ విచారణను సన్నా స్వాగతించారు. కాగా, 35 ఏళ్ల సన్నా మారిన్​ డిసెంబర్​ 2019లో ఫిన్లాండ్​కు ప్రధాని అయ్యింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement