Boat Capsizes in Greece: రోడ్స్ ఐలాండ్‌లో ఘోర పడవ ప్రమాదం, పెట్రోలింగ్ నౌక‌ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో మునిగిపోయిన బోటు, 8 మంది మృతి, గల్లంతైన వారి కోసం వెతుకులాట

గ్రీసు(Greece Migrants) దీవుల్లోని రోడ్స్ ఐలాండ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెట్రోలింగ్ నౌక‌ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో వలసదారులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతిచెంద‌గా, మ‌రో 18 మందిని పోలీసులు ర‌క్షించారు.మిగిలిన వారి కోసం కోస్టుగార్డు నౌక‌లు, హెలికాప్ట‌ర్ల‌తో గాలింపు చేప‌డుతున్నారు.

Boat Capsizes in Greece ( Image- AP)

గ్రీసు(Greece Migrants) దీవుల్లోని రోడ్స్ ఐలాండ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెట్రోలింగ్ నౌక‌ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో వలసదారులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతిచెంద‌గా, మ‌రో 18 మందిని పోలీసులు ర‌క్షించారు.మిగిలిన వారి కోసం కోస్టుగార్డు నౌక‌లు, హెలికాప్ట‌ర్ల‌తో గాలింపు చేప‌డుతున్నారు. ట‌ర్కీ కోస్టు తీరానికి స‌మీపంలో ఉన్న రోడ్స్ దీవుల్లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.గ‌డిచిన వారం రోజుల్లో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇది రెండోసారి. వారంక్రితం జరిగి బోటు ప్రమాద ఘ‌ట‌న‌లో ఏడు మంది మ‌ర‌ణించారు. ప్ర‌తి ఏడాది గ్రీసుకు అక్ర‌మంగా ప్ర‌వేశిస్తున్న శ‌ర‌ణార్థుల సంఖ్య 60 వేల‌కు చేరుకున్న‌ది. సిరియా నుంచి అత్య‌ధిక స్థాయిలో వ‌ల‌స‌లు జ‌రుగుతున్నాయి. ఆ త‌ర్వాత ఆఫ్ఘ‌న్‌, ఈజిప్టు, ఎరిత్రియా, పాల‌స్తీనా ఉన్నాయి.

నైజీరియాలో ఘోర విషాదం, ఫన్‌ఫెయిర్‌లో జరిగిన తోపులాటలో 35 మంది చిన్నారులు మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం

Boat Capsizes in Greece:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement