Imran Khan Arrest: ఇమ్రాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాకిస్తాన్, ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని తమ పౌరులను హెచ్చరించిన యూఎస్‌, యూకే, కెనడా

ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ (PTI) కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు

Imran Khan (Photo Credit- Facebook)

దాయాది దేశంలో అవినీతి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Former PM Imran Khan) అరెస్టుతో పాకిస్థాన్‌ (Pakistan) అట్టుడికిపోతున్నది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ (PTI) కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు.తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఉన్న తమ పౌరులు (Citizens), రాయబార సిబ్బంది (Diplomatic staff) అమెరికా (United States), యునైటెడ్‌ కింగ్డమ్‌ (UK), కెనడాలు (Canada) హెచ్చరికలు జారీచేశాయి.

జరభద్రంగా ఉండాలంటూ (Travel advisories) ఆదేశాలు జారీచేశాయి. జనసమ్మర్థం ఉంటే ప్రాంతాలకు వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలని తెలిపాయి.అత్యంత జాగరూకతతో ఉండాలని, రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదని సూచించింది. పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, దీనికోసం స్థానిక వార్తలను చూస్తూ ఉండాలని కోరింది. అత్యవసరమైతే తప్ప ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకూడదని చెప్పింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Pawan Kalyan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని వెల్లడి

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Jani Master About Allu Arjun Arrest: ఇద్దరికీ నేషనల్ అవార్డు వచ్చాకే జైలుకి వెళ్లారు.. బన్నీ అరెస్టుపై మీ స్పందన ఏమిటి?? మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. (వీడియో)

Arrest Warrant On Robin Uthappa: రాబిన్ ఉతప్పకు షాక్, ఈపీఎఫ్‌ చెల్లింపు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ, రూ.24 లక్షల డబ్బు జమ చేయాల్సిందేనని వెల్లడి