Iraq Child Marriage Bill: బాలికల కనీస వివాహ వయసు 9కి తగ్గింపు.. పార్లమెంట్ లో ఇరాక్ ప్రభుత్వం బిల్లు
ఇందుకు భిన్నంగా బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టింది.
Newdelhi, Aug 10: ఒకవైపు బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వాలు కొత్త చట్టాలు, నిబంధనలు తీసుకువస్తుంటే.. ఇందుకు భిన్నంగా బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం బాలుర వివాహ వయసును కూడా 15కు తగ్గించారు. ఇరాక్ ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టేస్తుందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది.