Another Shock to BRS, Brs Mla Anil Jadhav all set to Join Congress Party(X)

Hyd, Aug 10: తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా?, ఓ వైపు పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆగడం లేదా?, తాజాగా 11వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా తాజాగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచారు అనిల్ జాదవ్. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు అనిల్ జాదవ్ వంతు వచ్చేసిందని స్థానికంగా ప్రచారం జరుగతోంది.

దీనంతటికి కారణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు భట్టి. ఈ సందర్భంగా భట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు అనిల్. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేలా అనిల్ స్పీచ్ ఉండటంతో కాంగ్రెస్‌లో చేరే 11వ ఎమ్మెల్యే అనిల్‌ అని ప్రచారం జోరందుకుంది. ఈ సభకు భారీ అనుచరగణంతో కలిసి రావడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరుంది.

ఒకానొక దశలో తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని మర్చిపోయి మరి పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో కాంగ్రెస్ నేతలే ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్‌లో చేరే కంటే ముందు కాంగ్రెస్‌లోనే పనిచేశారు అనిల్ జాదవ్. 2009, 2014 ఎన్నికల్లో బోథ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే వారం కవితకు బెయిల్, కేటీఆర్ సంచలన కామెంట్స్,సుంకిశాల పాపం కాంగ్రెస్‌దేనని ఆరోపణ

అయితే ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ నుండి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2019లో బీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అనిల్ జాదవ్‌తో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ సైతం కాంగ్రెస్‌ గూటికి చేరుతారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ చేరికలు ఉంటాయని తెలుస్తోండగా దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.