Hyd, Aug 9: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్ రావచ్చని వీలైతే వచ్చే వారమే బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
జైల్లో సౌకర్యాలు ఏమి లేవని, కవిత 11 కిలోల బరువు తగ్గారని తెలిపారు. 12 వేల మంది ఉండాల్సిన జైల్లో 30 వేల మంది ఉన్నారని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటికే తాము న్యాయవాదులను కలిశామని వెల్లడించారు.
సుంకిశాల ఘటనపై బీఆర్ఎస్ ను నిందించడం సిగ్గు చేటు అని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ప్రభుత్వం తప్పు లేకుంటే.. సుంకిశాల ఘటనను వారం రోజులపాటు ఎందుకు దాచి పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ఘటన జరిగిందని, ఇది ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి రేవంత్ వైఫల్యమేనని ఆరోపించారు.
బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి సంస్థలకు లీగల్ నోటీసులు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో నీటి కోసం పోరాటం జరుగుతుందని, హైదరాబాద్‌లో మాత్రం కేసీఆర్ ముందు చూపుతో ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు. తెలంగాణలో అమ్‌జెన్ బయోటెక్ పెట్టుబడులు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సుంకిశాల ఘటన జరిగిందని .. 2వ తేదీన టన జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? తెలిసి దాచిపెట్టారా? చెప్పాలన్నారు. గతంలో మేడిగడ్డ విషయాన్ని తాము రహస్యంగా ఉంచలేదని, ప్రమాదం జరిగిన గంటల్లోనే నిర్మాణ సంస్థ స్పందించిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే సభలో స్వీట్లు పంచిన నేతలు సుంకిశాల ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.