Joe Biden's 'Awkward' Moment at G7 Summit: జీ7 సమ్మిట్‌లో జో బైడెన్ వింత ప్రవర్తన వీడియో వైరల్, అమెరికా అధినేత ప్రవర్తనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్‌ను తిలకిస్తోండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు.
ఇటలీ తీరప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులపాటు జీ-7 సదస్సు కొనసాగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందకు జీ-7 కూటమి దేశాల నేతలు ఇటలీ చేరుకున్నారు. కాగా, సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్‌ను వీక్షించారు. పారా గైడ్లింగ్ చేస్తున్న వారిని పలకరించారు. ఆ సమయంలో జో బైడెన్ వింతగా ప్రవర్తించారు.
తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్‌ను తిలకిస్తోండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్‌ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైడెన్‌కు ఏమైందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇలా కొన్ని వింత ప్రవర్తన వీడియోలు వైరల్ అయ్యాయి. విమానం ఎక్కుతూ తూలి పడబోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫిటినెస్, మతిమరుపుపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)