Liberia New President: ఆఫ్రికా దేశం లైబీరియా నూతన అధ్యక్షుడిగా జోసఫ్ బోయకై, ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్ వీహ్‌పై 20,567 ఓట్ల తేడాతో ఘన విజయం
ఆఫ్రికా దేశం లైబీరియా (Liberia) నూతన అధ్యక్షుడిగా జోసఫ్ బోయకై (Joseph Boakai) ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్ వీహ్‌పై (George Weah) 20,567 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత జాతీయ ఎన్నికల సంఘం (NEC) ఈ మేరకు ప్రకటించింది.
ఆఫ్రికా దేశం లైబీరియా (Liberia) నూతన అధ్యక్షుడిగా జోసఫ్ బోయకై (Joseph Boakai) ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్ వీహ్‌పై (George Weah) 20,567 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత జాతీయ ఎన్నికల సంఘం (NEC) ఈ మేరకు ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో వీహ్‌కు 49.36 శాతం ఓట్లు రాగా, బోకాయ్ 50.64 శాతం ఓట్లతో గెలుపొందారని వెల్లడించింది. వీహ్ ఇప్పటికే తన ఓటమిని అంగీకరించారు.
ఆరేండ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వీహ్ విజయం సాధించారు. దీంతో లైబీరియా అధ్యక్షుడైన తొలి ఆఫ్రికన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా (African Footballer) రికార్డు సృష్టించారు.అయితే అవినీతి మరకలు అంటుకోవడంతో ఈ ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపారు. నూతన అధ్యక్షుడికి.. వీవ్ శుభాకాంక్షలు చెబుతూ.. ప్రతిఒక్కరు మార్పును అంగీకరించాల్సిందేనని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)