Karnataka Hijab Row: కర్ణాటక హిజాబ్​ వ్యవహారంపై మలాలా ట్వీట్, ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం, మహిళలను చిన్నచూపును ఆపాలంటూ ఆవేదన

కర్ణాటకలో మొదలైన హిజాబ్​ వ్యవహారం రోజు రోజుకు రాజకీయ రంగును పులుముకుంటోంది. తాజాగా ఈ అంశంపై ఉద్యమకారిణి, నోబెల్​ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తోంది.

Malala Yousafzai (Photo Credits: Twitter/maXes_MB)

కర్ణాటకలో మొదలైన హిజాబ్​ వ్యవహారం రోజు రోజుకు రాజకీయ రంగును పులుముకుంటోంది. తాజాగా ఈ అంశంపై ఉద్యమకారిణి, నోబెల్​ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తోంది. యూసఫ్‌జాయ్ ట్వీట్​లో.. చదువు, హిజాబ్‌లో ఏది ఎంచుకోవాలో కళాశాల మమ్మల్ని బలవంతం చేస్తోంది అంటూ విద్యార్థిణిలు ఆవేదనను ట్వీట్​ చేసిన ఆమె.. ఆపై భారతీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. బాలికలు తమ హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయానకంగా ఉందని వ్యాఖ్యానించారామె. ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం. భారత నాయకులు ముస్లిం మహిళలను చిన్నచూపును ఆపాలి. అంటూ ఆమె ఒక ట్వీట్​ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now