Kuwait Fire: కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 5 గురు భారతీయులతో సహా 40 మంది మృతి, మంగాఫ్ నగరంలోని అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు
కువైట్ (Kuwait)లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగాఫ్ (Mangaf) నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు కువైట్ మీడియా తెలిపింది. బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
కువైట్ (Kuwait)లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగాఫ్ (Mangaf) నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు కువైట్ మీడియా తెలిపింది. బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో పై అంతస్తు వరకూ వ్యాపించాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో అందులో నివసిస్తున్న వారు బయటకు వచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పటివరకూ 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు 50 మందిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళను వెనక నుంచి ఢీకొట్టిన కారు
Here's Tweet and Fire Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)