Mexico Road Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రయాణీకుల బస్సును ఢీకొట్టిన ట్రక్కు, 19 మంది మృతి, 18 మందికి తీవ్ర గాయాలు

ఉత్తర మెక్సికోలోని హైవేపై మంగళవారం ప్రయాణీకుల బస్సు, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 19 మంది మరణించగా, 18 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

Mexico Road Accident (Photo Credits: X/@Mister_Nikita_X)

ఉత్తర మెక్సికోలోని హైవేపై మంగళవారం ప్రయాణీకుల బస్సు, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 19 మంది మరణించగా, 18 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఓడరేవు నగరమైన మజత్లాన్‌కు సమీపంలోని ఎలోటా టౌన్‌షిప్‌లో ఈ ప్రమాదం జరిగిందని రాష్ట్ర పౌర రక్షణ కార్యాలయ డైరెక్టర్ రాయ్ నవర్రెటే తెలిపారు. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. బస్సులో 37 మంది ఉన్నారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement