Inmates Escaped in Nigeria: భారీ వర్షాలతో దెబ్బతిన్న జైలు.. కూలిన జైలు ప్రహారీ గోడ.. 118 మంది ఖైదీలు పరార్.. నైజీరియాలో ఘటన
ఆ దేశంలోని ఓ జైలు నుంచి 118 మంది ఖైదీలు పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి.
Newdelhi, Apr 26: భారీ వర్షాలు నైజీరియా (Nigeria) పోలీసులకు కొత్త చిక్కులు తీసుకొచ్చాయి. ఆ దేశంలోని ఓ జైలు నుంచి 118 మంది ఖైదీలు (Inmates) పరారయ్యారు. అసలేమైందంటే.. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. జైలు ప్రహారీ గోడ కూలడంతో.. అదను చూసుకుని 118 మంది ఖైదులు జైలు నుంచి పరారయ్యారని అధికారులు వెల్లడించారు. పారిపోయిన వారికోసం గాలిస్తున్నామని, ఇప్పటివరకు 10 మందిని పట్టుకోగలిగామని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)