Covid in Israel: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్, ఒమిక్రాన్‌కు చెందిన రెండు ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2 లను గుర్తించిన ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ
తాజాగా ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఒమిక్రాన్ కు చెందిన రెండు ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2 లను కొత్త వేరియంట్ కలిగి ఉందని ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈరోజు తెలిపింది.
కరోనా మళ్లీ పుంజుకుంటోంది. తాజాగా ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఒమిక్రాన్ కు చెందిన రెండు ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2 లను కొత్త వేరియంట్ కలిగి ఉందని ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈరోజు తెలిపింది. బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా కొత్త వేరియంట్ బయటపడింది.
ఈ విషయాన్ని The Times of Israel నివేదించింది. ఈ వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు ఉన్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే ఈ వేరియంట్ వల్ల ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ కరోనా ప్రతిస్పందన విభాగం చీఫ్ సల్మాన్ జర్కా తెలిపారు. అందువల్ల ఈ వేరియంట్ వ్యాప్తి, కేసుల గురించి ఆందోళన చెందడం లేదని చెప్పారు. దీంతో పాటుగా ఇజ్రాయెల్ న్యూస్ ఛానల్ kan.org కూడా దీనిని నివేదించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)