Nigeria Road Accident: నైజీరియాలో ఘోర ప్రమాదం, 90 మంది ప్రయాణికులతో పట్టాలు దాటుతున్న బస్సును ఢీకొట్టిన రైలు, ఆరుగురు మృతి
నైజీరియా దేశం లాగోస్ నగరంలోని ఐకెజా ఏరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఓ ప్రయాణికుల బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది.
నైజీరియా దేశం లాగోస్ నగరంలోని ఐకెజా ఏరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఓ ప్రయాణికుల బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది. అనంతరం బస్సును ట్రాక్ వెంట కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 90 మంది ఉన్నారు. బస్సును రైలు డీకొట్టిన ఘటన తెలియగానే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
Here's UPdate
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement