North Korea: రెండు బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను పరీక్షించి దూకుడు పెంచిన ఉత్తర కొరియా, యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశానికి పిలుపునిచ్చిన అమెరికా

ఆ నిషేధిత క్షిప‌ణుల‌ను ఈ వారంలోనే ఆర‌వ‌సారి ఆ దేశం ప‌రీక్షించ‌డం గ‌మ‌నార్హం. అమెరికా, ద‌క్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయ‌ని, దానికి కౌంట‌ర్‌గా మేము క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు ఉత్త‌ర కొరియా తెలిపింది

File image of North Korea Dictator Kim Jong-un | Image Courtesy: Facebook

ఉత్త‌ర కొరియా ఈ రోజు రెండు బాలిస్టిక్ మిస్సైళ్ల‌( Ballistic Missiles)ను ప‌రీక్షించింది. ఆ నిషేధిత క్షిప‌ణుల‌ను ఈ వారంలోనే ఆర‌వ‌సారి ఆ దేశం ప‌రీక్షించ‌డం గ‌మ‌నార్హం. అమెరికా, ద‌క్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయ‌ని, దానికి కౌంట‌ర్‌గా మేము క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు ఉత్త‌ర కొరియా తెలిపింది. మంగ‌ళ‌వారం కూడా జ‌పాన్ మీదుగా ఉత్త‌ర కొరియా ఓ మిస్సైల్‌ను ఫైర్ చేసింది. ఈ నేప‌థ్యంలో యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. రష్యా, చైనా దేశాలు ఉత్త‌ర కొరియాకు అండ‌గా నిలుస్తున్నాయ‌ని అమెరికా ఆ మీటింగ్‌లో ఆరోపించింది. ఉత్త‌ర కొరియాపై ఆంక్ష‌లు విధించ‌కుండా ఆ రెండు దేశాలు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్లు అమెరికా తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)