Fighter Planes Collide: గాల్లో విన్యాసాలు చేస్తుండగా ఢీకొన్న రెండు విమానాలు, ఆరుగురు మృతి, అమెరికాలో ఎయిర్‌ షో నిర్వహిస్తుండగా ప్రమాదం, అంతా చూస్తుండగానే బుగ్గిపాలైన ఆరు ప్రాణాలు, వీడియో ఇదుగోండి!

అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్‌ షోలో (Air show) అపశృతి చోటుచేసుకున్నది. రెండు బాంబర్‌ విమానాలు ఢీకొనడంతో (2 Fighter Planes Collide) ఆరుగురు మృతిచెందారు. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ షో (Airshow) నిర్వహిస్తున్నారు.

B-17 Bomber plane Crash (Photo Credit- ANI)

Dallas, NOV 13: అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్‌ షోలో (Air show) అపశృతి చోటుచేసుకున్నది. రెండు బాంబర్‌ విమానాలు ఢీకొనడంతో (2 Fighter Planes Collide) ఆరుగురు మృతిచెందారు. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ షో (Airshow) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బోయింగ్‌ బీ-17 బాంబర్‌ విమానం (Boeing B-17 bomber) గాలిలోకి ఎగిరి భూమికి కొంత ఎత్తులో ప్రయాణిస్తున్నది. ఇంతలో బెల్‌ పీ-63 కింగ్‌కోబ్రా అనే ఫైటర్‌ విమానం (Bell P-63 Kingcobra) దానిని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు క్షణాల్లోనే కుప్పకూలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు యుద్ధవిమానాల్లో ఉన్న ఆరుగురు మరణిచారని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA), నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (NTSB) విచారణకు ఆదేశించాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement