Pakistan: వీడియో ఇదిగో, తమ జాతి కాదని 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు, పది వాహనాలకు నిప్పు, పాకిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్సులో ఘటన

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లాలో ఉగ్రవాదులు 23 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపారు.

Gunmen Kill 23 Bus Passengers in Balochistan’s Musakhel After Stopping Vehicles and Checking Identities

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లాలో ఉగ్రవాదులు 23 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపారు. దీంతో పాటు పది వాహనాలకు నిప్పు పెట్టారు. పంజాబ్ (పాక్) నుంచి వస్తున్న వాహనాలను ఆపి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వెనక బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆహారం గొంతులో ఇరుక్కుని వెనుజులా సైక్లింగ్ స్టార్ మృతి, ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న డ్యానియెలా లారియల్‌ కిరినోస్‌

ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫ్‌రాజ్ బుగ్టి ఖండించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన వెనకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి బీఎల్ఏ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement