Lahore, JAN 18: ఇరాన్ పై వైమానిక దాడులకు పాల్పడింది పాకిస్థాన్ (Pakistan Airstrike on Iran). ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఎయిర్ స్ట్రైక్స్ (airstrikes) నిర్వహించింది. సిస్టన్ బెలూచిస్తాన్ ప్రావిన్స్ లోని 7 ప్రదేశాల్లో ఆకస్మిక దాడులు చేసింది పాకిస్థాన్. ఈ ఘటనలో భారీగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
Sources in the Pakistani Armed Forces are reporting that the Air Force has conducted several Airstrike tonight on a Baloch Militant Group in Eastern Iran near the City of Saravan, roughly 20 Miles into the Sistan and Baluchestan Provence from the Border with Pakistan; Smoke is… pic.twitter.com/VKO8fjohWD
— OSINTdefender (@sentdefender) January 18, 2024
ఎయిర్ స్ట్రైక్స్ చేసిన ప్రాంతంలో భారీగా పొగ అలుముకుంది. బలూచ్ మిలిటెంట్ గ్రూప్ ను టార్గెట్ చేసి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. సర్వాన్ నగరానికి 20 మైళ్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి.