Pakistan: పట్టపగలే బరితెగించిన కామాంధుడు, నడిరోడ్డుపై బాలికను వెనకనుంచి పట్టుకుని లైంగిక దాడి, పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఘటన

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ షాకింగ్‌ ఘటన సీసీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. బుర్ఖా ధరించి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై ఓ దుండగుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెను పట్టుకుని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Man gropes burqa-clad woman walking on street in Pakistan (Photo-Video Grab)

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ షాకింగ్‌ ఘటన సీసీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. బుర్ఖా ధరించి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై ఓ దుండగుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెను పట్టుకుని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విడిపించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. వేధించిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఒంటరిగా వెళ్తున్న ఆమెను దుండగుడు ఫాలో అవుతున్నట్లు అంతకు ముందు గల్లీలో ఉన్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. అయినా సోషల్‌ మీడియా విమర్శలతో ఫిర్యాదు స్వీకరించామని స్థానిక పోలీసులు వెల్లడించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement