Paul Pelosi Arrested: మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాన్ని నడిపిన నాన్సీ పెలొసి భ‌ర్త పౌల్ పెలొసి అరెస్ట్, 5 వేల డాల‌ర్ల పూచీక‌త్తుపై విడుదల

మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాన్ని న‌డుపుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. నాపా కౌంటీ క్రిమిన‌ల్ కోర్టులో ఆయ‌న్ను హాజ‌రుప‌రిచారు. శ‌నివారం రాత్రి నాపా కౌంటీ వ‌ద్ద ఆయ‌న్ని అదుపులోకి తీసుకున్నారు.

Paul Pelosi (Photo Credits: ANI)

అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలొసి భ‌ర్త పౌల్ పెలొసిని పోలీసులు అరెస్టు చేశారు. మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాన్ని న‌డుపుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. నాపా కౌంటీ క్రిమిన‌ల్ కోర్టులో ఆయ‌న్ను హాజ‌రుప‌రిచారు. శ‌నివారం రాత్రి నాపా కౌంటీ వ‌ద్ద ఆయ‌న్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు నేరాభియోగాల‌పై ఆయ‌న్ను జైలుకు తీసుకువెళ్లారు. ర‌క్తంలో ఆల్క‌హాల్ కాంటెంట్ అధిక స్థాయిలో ఉంద‌ని కూడా ఆయ‌న్ను అరెస్టు చేశారు. అయితే 5 వేల డాల‌ర్ల పూచీక‌త్తుపై పౌల్ పెలొసిని విడుదల చేసిన‌ట్లు తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif