Private Jet Crashed: ఘోర విమాన ప్రమాదం, తొమ్మిది మంది మృతి, టెకాఫ్‌ అయిన 15 నిమిషాలకే పేలుడు, డొమినికన్‌ రిపబ్లిక్‌లో లాస్‌ అమెరికాస్‌ ఎయిర్‌పోర్టులో విషాద ఘటన

ఇద్దరు సిబ్బందితో కూడిన ఓ ప్రైవేటు విమానం డొమినికన్‌లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తున్నది. టెకాఫ్‌ అయిన 15 నిమిషాలకే రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్‌ అమెరికాస్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా లాండ్‌ అయింది.

Representational image | (Photo Credits: Getty Images)

డొమినికన్‌ రిపబ్లిక్‌లో (Dominican Republic) ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని శాంటో డొమింగోలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ఓ ప్రైవేటు విమానం డొమినికన్‌లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తున్నది. టెకాఫ్‌ అయిన 15 నిమిషాలకే రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్‌ అమెరికాస్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా లాండ్‌ అయింది. ఈ క్రమంలో విమానం పేలిపోయిందని (Private Jet Crashed), తొమ్మిది మంది మరణించారని విమానయాన సంస్థ వెల్లడించింది. వారిలో ఆరుగురు విదేశీ ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని పేర్కొన్నది. అయితే వారు ఏ దేశానికి చెందిన వారనే విషయంపై స్పష్టనివ్వలేదని స్థానిక మీడియా వెల్లడించింది. మరొకరు డొమినకన్‌ అని తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement