Senegal Road Accident: సెనగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిన మరో బస్సు, 40 మంది అక్కడికక్కడే మృతి, మరో 78 మందికి తీవ్రగాయాలు

ఆఫ్రికా దేశం సెనగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కఫ్రిన్‌ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో 78 మంది గాయపడ్డారు.

Accident (Credits: Wikimedia )

ఆఫ్రికా దేశం సెనగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కఫ్రిన్‌ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో 78 మంది గాయపడ్డారు. దేశంలోని ఒకటో నంబర్‌ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు టైరు పంక్చర్‌ అయింది. దీంతో అదుపుతప్పి రోడ్డుకు అవతలివైపునకు దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో బస్సు దానిని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి. కాగా ఈ ఘటనపట్ల దేశ అధ్యక్షుడు మాక్కి సాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు దేశంలో సంతాప దినాలు పాటించాలని ప్రకటించారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement