Somalia Car Bomb:హోటల్లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు, విద్యార్థులతో సహా తొమ్మిది మంది మృతి, మరో 47 మందికి తీవ్ర గాయాలు

సోమాలియాలో రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. తొలుత పేలుడు పదార్థాలతో నింపిన కారుతో తవక్కల్‌ హోటల్‌ గేటును ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు.

Bomb Blast (Representational Image)

సోమాలియాలో రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. తొలుత పేలుడు పదార్థాలతో నింపిన కారుతో తవక్కల్‌ హోటల్‌ గేటును ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం హోటళ్లోకి ప్రవేశించిన సాయుధులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో తొమ్మిది మరణించగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మరణించినవారిలో నలుగురు భద్రతా సిబ్బంది, విద్యార్థులు ఉన్నట్లు సెక్యూరిటీ మినిస్టర్‌ యూసుఫ్‌ హుస్సేన్‌ ధుమాల్‌ వెల్లడించారు. ఉగ్రవాదులు దాడిచేసిన హోటల్‌ సమీపంలో ఓ పాఠశాల ఉందని, పేలుళ్ల నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. కాగా, భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఆత్మాహుతి దాడిలో మరో ఉగ్రవాది చనిపోయాడని చెప్పారు. కాగా, ఈదాడికి బాధ్యత వహిస్తూ అల్‌-షబాబ్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement