Sri Lanka Crisis: ఓ పక్క నిరసనలు, అయినా ముద్దుల్లో మునిగిన తేలిన జంట, శ్రీలంక దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కిస్సింగ్ ఫోటో వైరల్
గత బుధవారం ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే కార్యాలయం ముందు నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ ఫోటో తీసినట్లు రాసుకొచ్చింది న్యూస్‌వైర్.
శ్రీలంక దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక న్యూస్ సంస్థ న్యూస్‌వైర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనల్లో పాల్గొన్న సమయంలో ఓ జంట ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. గత బుధవారం ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే కార్యాలయం ముందు నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ ఫోటో తీసినట్లు రాసుకొచ్చింది. కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో పాల్గొన్న తర్వాత ఒక జంట ఇలా కిస్సింగ్ తో ప్రేమను ప్రదర్శించడం కనిపించిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)