Sri Lanka Economic Crisis: శ్రీలంక అధ్యక్షుడు పరారీలో భారత్ ప్రమేయం.. వార్తలను కొట్టిపారేసిన భారత హైకమిషన్ కార్యాలయం, శ్రీలంక ప్రజలకు భారత్ సాయం కొనసాగుతుందని స్పష్టం
దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్ కార్యాలయం స్పందించింది. ఈ వార్తలు నిరాధారం, కల్పితమైనవని కొట్టి పారేసేంది
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గొటబాయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజూమునే మాల్దీవులకు పారిపోయారు. ఇదిలా ఉంటే ఆయన పారిపోయేందుకు భారత్ సహకరించిందనే వదంతులు శరవేగంగా వ్యాపించాయి. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్ కార్యాలయం స్పందించింది. ఈ వార్తలు నిరాధారం, కల్పితమైనవని కొట్టి పారేసేంది. ప్రజాస్వామ్యయుతంగా తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈమేరకు ట్వీట్ చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)