Turkey Earthquake: టర్కీ భూకంపంలో గుండెలు పిండేస్తున్న ఫోటో, తమ్ముడిని కాపాడుకునేందుకు అమ్మలా మారిన పదేళ్ల చిన్నారి, తలకు చేయి అడ్డుపెట్టి..

భవనం స్లాబ్‌ విరిగి వాళ్లపై పడింది. అయితే అదృష్టం కొద్ది స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్‌ సపోర్టు కావడంతో దానికింద వాళ్లు నలిగిపోకుండా ప్రాణాలతో ఉన్నారు

Turkey girl with her brother is ruling internet (Photo-Twitter)

టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 4,300 మంది మరణించారు. శతాబ్దపు అత్యంత బలమైన భూకంపాలలో ఒకటిగా భావిస్తున్న ఈ భూకంపం కారణంగా చుట్టుపక్కల భారీ ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు అల్లాడిపోయారు. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తుల భయానక చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా ఓ ఫోటో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకోవడంతో పాటు హృదయవిదారకరంగా నిలిచింది.

భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథాలల కింద 10 ఏళ్ల లోపు వయసున్న అక్కా తమ్ముడు ఇరుక్కున్నారు. భవనం స్లాబ్‌ విరిగి వాళ్లపై పడింది. అయితే అదృష్టం కొద్ది స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్‌ సపోర్టు కావడంతో దానికింద వాళ్లు నలిగిపోకుండా ప్రాణాలతో ఉన్నారు.అంతటి భయకరమైన పరిస్థితుల్లోనూ ఆ 10 ఏండ్ల బాలిక తమ్ముడి తలకు తన చేతిని అడ్డుపెట్టింది. చావు కౌగిట్లోనూ ఆ బాలిక పడుతున్న తపన చూసిన వారి గుండెలు పిండేసున్నాయి. నిద్రలో ఉండగానే స్లాబ్‌ విరిగి మీద పడటంతో చిన్నారులిద్దరూ శిధిలాల్లో చిక్కుకుపోయారు. రెస్క్యూ అధికారులు వారిని రక్షించినట్లు సమాచారం.

Here's Viral Pic