Venezuela Road Accident: వీడియోలు ఇవిగో, రోడ్డు మీద 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు, 16 మంది మంటల్లో సజీవ దహనం
వెనెజులాలో (Venezuela) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.వెనెజులాలోని ఓ హైవేపై బుధవారం ఈ ప్రమాదం సంభవించింది.
వెనెజులాలో (Venezuela) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.వెనెజులాలోని ఓ హైవేపై బుధవారం ఈ ప్రమాదం సంభవించింది. ముందుగా ఓ ట్రక్కు అతివేగంగా వెళ్తూ అనేక కార్లను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఓ బస్సు, పలు కార్లు సహా మొత్తం 17 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)