Pak Journalist flood updates: వృత్తిపట్ల ఆ పాక్ జర్నలిస్ట్ నిబద్ధత చూసి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. మీరూ చూడండి..
ఈ క్రమంలో ఒక రిపోర్టర్ పాకిస్తాన్‌లోని వరదలకు సంబంధించి లైవ్ రిపోర్టింగ్‌ని అందించడానికి ఏకంగా వరద ఉధృతిలో... పీకల్లోతు నీటిలో నిలబడి మరీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించాడు.
Islamabad, August 30: వృత్తిపట్ల కొందరు జర్నలిస్టులు అపారమైన నిబద్ధత ప్రదర్శిస్తారు. ఇదీ అలాంటి ఘటనే. పాకిస్తాన్‌లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలతో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో పరిస్థితులు గురించి సమాచారాన్ని అందించే పనిలో పడ్డాయి అక్కడ మీడియా సంస్థలు. ఈ క్రమంలో ఒక రిపోర్ట్ ర్ పాకిస్తాన్‌లోని వరదలకు సంబంధించి లైవ్ రిపోర్టింగ్‌ని అందించడానికి పెద్ద సాహసమే చేశాడు. సదరు రిపోర్టర్ ఏకంగా వరద ఉధృతిలో... పీకల్లోతు నీటిలో నిలబడి మరీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించాడు. దీంతో నెటిజన్లు ఆ జర్నలిస్ట్ డెడికేషన్ వర్క్ కి హ్యాట్సాప్ అని ప్రశంసిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)