Bangladesh Train Fun: అక్క రైలు టాప్ ఎక్కేందుకు తెగ ప్రయత్నించింది. కానీ, కుదరలే.. ఇంతలో పోలీసులు వచ్చారు. తర్వాత ఏమైందంటే?
రైలు పైన ఉన్న కొందరు ఆమెకు సాయం చేశారు కూడా. కానీ ఆమె రైలు పైకి ఎక్కలేకపోతోంది. ఇంతలో రైల్వే పోలీస్ లాఠీతో రావడంతో ఒక్కసారిగా ఆమె దిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తూ నవ్వులు పూయిస్తుంది.
Dhaka, August 26: అవసరమో, అత్యుత్సాహమో.. ఎదైతేనేమీ కొన్నిసార్లు కొందరు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. ఇదీ అలాంటి ఘటనే. బంగ్లాదేశ్ రైల్వేస్టేషన్లో ఒక ఇంటర్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగి ఉంది. ఆ రైలు ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది.దీంతో కొంతమంది రైలు పైకి ఎక్కి కూర్చున్నారు. పాపం ఓ మహిళకు రైలులో సీటు దొరకలేదు కాబోలు, ఎలాగైనా వెళ్లాలనుకుని ఆమె కూడా రైలు ఎక్కేందుకు యత్నించింది. రైలు పైన ఉన్న కొందరు ఆమెకు సాయం చేశారు కూడా. కానీ ఆమె రైలు పైకి ఎక్కలేకపోతోంది.
ఇంతలో రైల్వే పోలీస్ లాఠీతో రావడంతో ఒక్కసారిగా ఆమె దిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తూ నవ్వులు పూయిస్తుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)