Ex-PAK PM Imran Khan: భారత్‌ను మరోసారి పొగడ్తల్లో ముంచెత్తిన పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్, భారత్‌లానే రష్యా నుంచి చౌకగా క్రూడ్ అయిల్ కోరుకుంటున్నామని వెల్లడి
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారతదేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. తాము కూడా భారత్‌లానే రష్యా నుంచి చౌకగా క్రూడ్ అయిల్‌ని పొందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ తన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోవడంతో అలా చేయలేకపోయామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

పాకిస్తాన్ ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ తగ్గింపు రేటుతో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందని, అలా తన దేశం కూడా కొనుగోలు చేయగలదా అంటూ వీడియోలో విచారం వ్యక్తం చేశారు.దీంతో పాటుగా యూఎస్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయాలన్న భారత్ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు.
Here's Video