Plane Catches Fire: షాకిస్తున్న వైరల్ వీడియో.. విమానం ల్యాండ్ అవుతుండగా క్షణాల్లో మంటలు, భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న 126 మంది ప్రయాణికులు

Airplane catches fire at Miami airport after landing gear (Photo-Video Grab)

యుఎస్లో‌ని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై ఒక విమానం భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెడ్ ఎయిర్ ఫ్లైట్ ఫ్రంట్‌ ల్యాండింగ్ గేర్‌ పెయిలవ్వడంతో 126 మంది ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. దీంతో ప్రయాణీకులు ప్రాణభయంతో వణికిపోయారు.డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుండి వస్తున్న విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతొ రన్‌వే నుండి పక్కకు జరిగిన విమానం క్రేన్ టవర్, చిన్న భవనంతో సహా అనేక వస్తువులను ఢీకొట్టింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో విపరీతంగా షేర్‌ అవుతోంది.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement