Harnaaz Sandhu Emotional Video:స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్న మాజీ విశ్వసుందరి హర్నాజ్ సంధు, బొన్ని గాబ్రియేల్‌కు విశ్వ సుందరి కిరీటాన్ని తొడిగిన భారత్ అందగత్తె
విశ్వ సుందరి పేరును ప్రకటించేటప్పుడు స్టేజ్‌పైకి వచ్చిన హర్నాజ్.. మిస్ యూనివర్స్ హోదాలో చివరిసారిగా ర్యాంప్‌పై వాక్ చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడిపోబోయింది. అనంతరం తిరిగి ఆమె వాక్ కొనసాగించింది.
మిస్ యూనివర్స్ – 2022 పోటీల్లో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్‌విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. మొత్తం 80 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో ఆమె అందర్నీ పక్కకు నెట్టి విశ్వ సుందరిగా నిలిచింది. భారత్‌కు చెందిన పంజాబీ అందగత్తె, మిస్ యూనివర్స్-2021 హర్నాజ్ సంధు.. ఈ పోటీల్లో పాల్గొని బొన్ని గాబ్రియేల్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తొడిగింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై భావోధ్వేగానికి గురైంది.
విశ్వ సుందరి పేరును ప్రకటించేటప్పుడు స్టేజ్‌పైకి వచ్చిన హర్నాజ్.. మిస్ యూనివర్స్ హోదాలో చివరిసారిగా ర్యాంప్‌పై వాక్ చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడిపోబోయింది. అనంతరం తిరిగి ఆమె వాక్ కొనసాగించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతేడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో హర్నాజ్ సంధూ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక విశ్వసుందరి కిరీటం దక్కినట్లైంది. సుస్మితా సేన్ (1994), లారా దత్తా (2000)ల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీక్వీన్‌గా హర్నాజ్ గుర్తింపు పొందింది.
Here's Video