Yemen Stampede: రంజాన్ వేళ ఘోర విషాదం, యెమెన్‌లో ఆర్థిక సాయం పంపిణీలో తొక్కిసలాట, 80 మంది మృతి, వందలమందికి గాయాలు
రంజాన్ (Ramadan) సందర్భంగా సనాలో (Sanaa) ఏర్పాటుచేసిన ఆర్థిక సాయం పంపిణీ (Charity distribution) కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో 85 మందికిపైగా మరణించారు. 322 మందికిపైగా గాయపడ్డారు.
అరేబియన్ దేశం యెమెన్ (Yemen) రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకున్నది. రంజాన్ (Ramadan) సందర్భంగా సనాలో (Sanaa) ఏర్పాటుచేసిన ఆర్థిక సాయం పంపిణీ (Charity distribution) కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో 85 మందికిపైగా మరణించారు. 322 మందికిపైగా గాయపడ్డారు.
రంజాన్ సందర్భంగా సనాలోని బాల్ అల్-యెమెన్ (Bab al-Yemen) ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నది. దీంతో ఆర్థిక సాయం కోసం ప్రజలు పెద్దసంఖ్యలో ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. పెద్దసంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోవడంతో వారి సంబంధీకులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నదని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)