PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్

పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయితో ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

PV Sindhu Marriage (Credits: X)

Hyderabad, Dec 23: ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం (PV Sindhu Marriage) రాజస్థాన్‌ లోని ఉద‌య్‌ పూర్‌ లో ఆదివారం రాత్రి 11.20 గంట‌ల‌కు అంగరంగ వైభవంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయితో (Venkata Dattasai) ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. ఉద‌య్‌ సాగ‌ర్ స‌ర‌స్సులో ఉన్న ర‌ఫ‌ల్స్ హోట‌ల్ ఈ వివాహ వేడుక‌కు వేదిక‌గా నిలిచినట్టు సమాచారం. పెళ్లి ఫొటోల‌ను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుద‌ల చేయ‌లేదు.

అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

ఇక్కడ పెద్దయెత్తున రిసెప్ష‌న్

రాజస్థాన్ లో జరిగిన సింధు వివాహానికి కొందరు మాత్రమే హాజరయ్యారు. అయితే, మంగళవారం హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా  రిసెప్ష‌న్ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు రాజ‌కీయ‌, సినీ, క్రీడా ప్ర‌ముఖులు పెద్దయెత్తున హాజ‌రుకానున్నట్టు సమాచారం.

వీడియోలు ఇవిగో, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం... బన్నీ తీరుపై ఓయూ జేఎసీ నేతల ఫైర్..ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని మండిపాటు



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif