India vs Sri Lanka,1st Test, Day 3: జడేజా మాయాజాలం, భారీ ఆధిక్యంలో భారత్, ఫస్ట్ ఇన్నింగ్స్ లో శ్రీలంక 174 పరుగులకు ఆలౌట్, 400 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చి శ్రీలంక నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిశాంక 61 (Nishanka) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ నిశాంక (26), అసలంక (1) ఆటను ఆరంభించారు. వీరిద్దరూ జాగ్రత్త పడుతూ ఆడారు.
Mohali, March 06: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో (,1st Test) భారత బౌలర్లు విరుచుకుపడుతున్నారు. దీంతో శ్రీలంక (Sri Lanka) కష్టాల్లో పడింది. మూడో రోజు లంచ్ టైమ్ కు శ్రీలంక 10/1 గా ఉంది. 574 పరుగుల భారీ స్కోరు వద్ద భారత్ (India) ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది. శనివారం మిగిలిన ఆటలో శ్రీలంకను 108/4 కట్టడి చేసింది. ఆదివారం మ్యాచ్ ప్రారంభమైంది. రవీంద్ర జడేజా (Ravindra Jadeja ) అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చి శ్రీలంక నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిశాంక 61 (Nishanka) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ నిశాంక (26), అసలంక (1) ఆటను ఆరంభించారు. వీరిద్దరూ జాగ్రత్త పడుతూ ఆడారు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్ తీసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే నిశాంక హాఫ్ సెంచరీ సాధించి మంచి ఊపు మీదన్నట్లు కనిపించాడు. ఇతనికి చక్కటి సహకారం అందిస్తూ వచ్చిన అసలంక (29) బుమ్రా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇతను అవుట్ అయిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. రవీంద్ర జడేజా వేసిన 61 ఓవర్ లో డిక్ విల్లా (2), లక్మల్ (0) వెనుదిరిగారు.
దీంతో శ్రీలంక జట్టు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. అప్పటికీ ఆ జట్టు స్కోరు 164 పరుగులు మాత్రమే. లాసిత్, ఫెర్నాండో, కుమారలు ఏమి పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు. నిశాంక ఒక్కడే అర్ధసెంచరీ సాధించాడు. ఇతను 61 పరుగులు చేసి నౌటౌట్ గా నిలిచాడు. మొత్తంగా లంక జట్టు 174 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగుల సంపూర్ణ ఆధిక్యం లభించింది.