ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. వార్న్ మరణవార్తతో నిశ్చేష్టకు గురయ్యానని, తీవ్ర విషాదం ముంచెత్తిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించాడు. "నువ్విక మాతో ఉండవని తెలిసి నిర్ఘాంతపోయాం. భరింపరాని విషాదంలో మునిగిపోయాం. వార్నీ... నువ్వున్న చోట ఎక్కడా విచారం, నిరుత్సాహం అనేవి ఉండేవి కావు... అది మైదానంలో కానీ, వెలుపల కానీ. మైదానంలో నీ బౌలింగ్ ను ఎదుర్కోవడం, బయట మాటల తూటాలు పేల్చుకోవడం ఎప్పటికీ ఓ పెన్నిధిలా భావిస్తాను. భారత్ లో నీకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. భారతీయుల మదిలోనూ నువ్వెప్పటికీ నిలిచే ఉంటావు... చాలా చిన్న వయసులోనే వెళ్లిపోయావు మిత్రమా!" అంటూ సచిన్ భావోద్వేగభరితంగా స్పందించాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)