Lockie Ferguson Record: 4 ఓవర్లు వేస్తే ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్

4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌కుండా మూడు వికెట్లు తీశాడు. వేసిన 4 ఓవర్లు మెయిడిన్ గా సత్తా చాటాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు ఇవేనని చెప్పాలి.

Lockie Ferguson bowls the most economical spell in T20 World Cup history

న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌కుండా మూడు వికెట్లు తీశాడు. వేసిన 4 ఓవర్లు మెయిడిన్ గా సత్తా చాటాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు ఇవేనని చెప్పాలి. అలాగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఇలా 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేసిన తొలి బౌల‌ర్‌గా కూడా ఫెర్గూస‌న్ నిలిచాడు. పాపువా న్యూ గినియాతో జ‌రిగిన మ్యాచులో కివీస్ ఈ న‌యా రికార్డు అందుకున్నాడు. గ‌తంలో కెన‌డాకు చెందిన సాద్ బిన్ జ‌ఫ‌ర్ కూడా 4 మెయిడిన్ ఓవ‌ర్లు వేసి 2 వికెట్లు తీశాడు. వీడియో ఇదిగో, ఒకే ఓవర్‌లో 36 పరుగులు పిండుకున్న వెస్టిండీస్ నికోలస్ పూరన్, బలైన ఆప్ఘన్ బౌలర్ అజ్మతుల్లా

ఇక పాపువా న్యూ గినియాతో జ‌రిగిన ఈ మ్యాచులో కివీస్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పీఎన్‌జీని ఫెర్గూస‌న్ ఘోరంగా దెబ్బతీశాడు. దీంతో ఆ జ‌ట్టు 78 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఛేద‌న‌లో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. ఇక ఇప్ప‌టికే ఈ రెండు జ‌ట్లు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంతో గ్రూప్‌-సీలో న్యూజిలాండ్ మూడో స్థానంతో త‌న ప్ర‌స్థానాన్ని ముగించింది. ఇటీవ‌ల కాలంలో అద్భుత‌మైన క్రికెట్ ఆడుతున్న కివీస్‌.. ఐసీసీ ఈవెంట్‌లో ఇలా నాకౌట్‌కు చేర‌కుండా వెనుదిరగ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.



సంబంధిత వార్తలు

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

IND vs AUS: భారతదేశం- ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్, రవీంద్ర జడేజాకు షాకిచ్చిన కోచ్ గౌతం గంభీర్, రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగనున్నట్లుగా వార్తలు

Jasprit Bumrah: భారత్ vs ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌, కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టేందుకు అడుగుదూరంలో జస్ప్రీత్ బుమ్రా, రికార్డు ఏంటంటే..

Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు