517 Runs in 40 Overs: 40 ఓవర్లలో 517 పరుగులు, టీ20లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్లు,ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సఫారీలు

టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టీండిస్ అత్యధిక స్కోర్ రికార్డు నెలకొల్పగా అదే మ్యాచ్ లో దాన్ని సఫారీలు బద్దలు కొట్టేశారు.

south-africa

అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టీండిస్ అత్యధిక స్కోర్ రికార్డు నెలకొల్పగా అదే మ్యాచ్ లో దాన్ని సఫారీలు బద్దలు కొట్టేశారు. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 517 పరుగులు సాధించాయి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ జాన్సన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో కింగ్‌ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన చార్లెస్‌.. మొదటి బంతి నుంచే ప్రోటీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ముంబై కైవసం, దుమ్మురేపిన హర్మన్‌ ప్రీత్, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి చాంపియన్స్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్న ఈ కరీబియన్‌.. అనంతరం మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను పూర్తిచేశాడు. చార్లెస్‌ అద్భుత ఇన్నింగ్స​ ఫలితంగా విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. చార్లెస్‌తో పాటు ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రోటీస్‌ బౌలరల్లో జానెసన్‌ మూడు వికెట్లు,పార్నెల్‌ రెండు వికెట్లు సాధించారు.

సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ అందుకోలేడన్న రవిశాస్త్రి.. ఇంతకీ ఆయన వివరణ ఏమిటంటే..

అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక టార్గెట్‌ను ఛేజ్‌ జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్‌ 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. డికాక్‌తో పాటు మరో ఓపెనర్‌ రెజా హెండ్రిక్స్‌ (28 బంతుల్లో 68 పరుగులు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరిలో కెప్టెన్‌ మార్‌క్రమ్‌ 38 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 259 పరుగుల లక్ష్యాన్ని చేజ్‌ చేసిన ప్రోటీస్‌.. ఈ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా (245/5) జట్టు పేరిట ఉంది. 2018లో న్యూజిలాండ్‌ జట్టుతో (20 ఓవర్లలో 243/6)తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఈ రికార్డు నమోదు చేసింది. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఈ రెండో టీ20 నిలిచింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌-ప్రోటీస్‌ జట్లు కలిపి 517 పరుగులు సాధించాయి.

ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ , ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 515 పరుగులు చేశాయి. తాజా మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన విండీస్‌,దక్షిణాఫ్రికా జట్లు ఈ ప్రపంచ రికార్డును బ్రేక్‌ చేశాయి.