Virat Kohli: రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళుతున్న విరాట్ కోహ్లీ, జయవర్దనే రికార్డును దాటేసిన టీమిండియా స్టార్, ఇక మిగిలింది ఆ ముగ్గురే..

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును కింగ్‌ కోహ్లి బద్దలు కొట్టాడు

Virat Kohli (photo-X)

టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును కింగ్‌ కోహ్లి బద్దలు కొట్టాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 25958 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఈ క్రమంలో జయవర్దనే(25957) పేరిట ఉన్న రికార్డును విరాట్‌ కోహ్లి అధిగమించాడు.

ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ 1243 పరుగులకు చేరుకున్నాడు. 21 మ్యాచ్‌లలో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను దాటాడు. వన్డే ప్రపంచకప్‌ హిస్టరీలో 34 మ్యాచ్‌లు ఆడిన బ్రియాన్ లారా 1225 పరుగులు చేశాడు.  ఇక బంగ్లాతో మ్యాచ్ లో సెంచరీ చేసిన కోహ్లీ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఐదో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.

సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్, ప్రపంచకప్‌‌లో భారత్‌కు ఇది నాలుగో విజయం, బంగ్లాకు మూడో ఓటమి

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 45 మ్యాచ్‌లు ఆడి 2278 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఉన్నాడు. అతడు 46 మ్యాచ్‌లు ఆడి 1743 పరుగులు చేశాడు. మూడో స్థానంలో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ఉన్నాడు. అతడు 37 మ్యాచ్‌లు ఆడి 1532 పరుగులు చేశాడు.

ఇక కోహ్లీ 35 పరుగులు పూర్తిచేసిన తర్వాత కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో 25,957 పరుగులు సాధించిన మహేళ జయవర్దెనేను దాటేశాడు. జయవర్దెనే తన కెరీర్‌లో 725 ఇన్నింగ్స్‌లో 25,957 పరుగులు సాధించగా.. కోహ్లీ 567 ఇన్నింగ్స్‌లలో 25,960 రన్స్‌ సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో టెస్టులలో కోహ్లీ.. 111 టెస్టులలో 8,676 పరుగులు చేశాడు. వన్డేలలో 284 మ్యాచ్‌లలో 13,230 పరుగులు సాధించాడు. టీ20లలో 115 మ్యాచ్‌లలో 4,008 రన్స్‌ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 బ్యాటర్లు

►సచిన్‌ టెండుల్కర్‌(ఇండియా)-34357

►కుమార్‌ సంగక్కర(శ్రీలంక)- 28016

►రిక్కీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)- 27483

►విరాట్‌ కోహ్లి(ఇండియా)- 25958*

►మహేల జయవర్ధనే(శ్రీలంక)- 25957