Asia Cup 2022, India vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే! ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం, టీమిండియా ఓపెనింగ్ జోడీపై భారీ అంచనాలు, ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశలు, ఆసియా కప్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చు అంటే!
సూర్యకుమార్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా త్రయం రాణిస్తే ఇండియా విజయం సునాయాసం అవుతుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో అందరి దృష్టి కోహ్లీ పైనే ఉంది. విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావటం గమనార్హం.
Dubai, AUG 28: ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ (India vs Pakistan) అంటే అభిమానుల దృష్టిలో అదో పెద్ద సమరం. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధానికి ఏ మాత్రం తక్కువ కాదన్నట్లుగా పాక్, ఇండియా జట్లు (Team India) గ్రౌండ్ లో తలపడుతుంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగి చాలా రోజులవుతుంది. నేడు మరోసారి హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ (India vs Pakistan) ఈ రోజు సాయంత్రం 7.30గంటలకు దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆసియా కప్ లో (Asia Cup) భాగంగా జరిగే ఈ మ్యాచ్ లో రెండు జట్ల ఆటగాళ్లు తమదే విజయమని దీమాను వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఇరుజట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇండియాపై పాక్ 10వికెట్ల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. అదే ఊపును ఈ రోజు జరిగే మ్యాచ్ లో పునరావృతం చేస్తామని పాక్ క్రికెటర్లు దీమాను వ్యక్తం చేస్తున్నారు.
భారత్ పేవరేట్ జట్టుగా ఆసియా కప్ లో (Asia Cup) బరిలోకి దిగుతుంది. భారత్, పాక్ మధ్య ఇప్పటి వరకు తొమ్మిది టీ20 మ్యాచ్ లు జరగ్గా ఆరు మ్యాచ్ లలో భారత్ జట్టు విజయం సాధించి మంచి ట్రాక్ రికార్డుతో ఉంది. అదే ఊపును కొనసాగిస్తూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేందుకు భారత్ జట్టు సన్నద్ధమైంది. క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ లో భారత్ ఓపెనింగ్ భాగస్వామ్యం కీలకంగా మారనుంది. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మతో (Rohit sharma) ఓపెనర్ గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ తో కలిసి రాహుల్ (Rahul) ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విరాట్ కోహ్లీ (Virat kohli) మూడవ స్థానంలో క్రిజ్ లోకి రానున్నారు. సూర్యకుమార్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా త్రయం రాణిస్తే ఇండియా విజయం సునాయాసం అవుతుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో అందరి దృష్టి కోహ్లీ పైనే ఉంది. విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావటం గమనార్హం. దీనికితోడు గతకొంతకాలంగా ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడుతున్న కోహ్లీ.. ఈ మ్యాచ్ లో రెచ్చిపోతాడా, నిరాశ కలిగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ రాణిస్తాడని తాజా, మాజీ క్రికెటర్లు చెబుతున్నా.. ఈ మ్యాచ్ కోహ్లీకి కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో ( Star Sports Network) మ్యాచ్ ప్రసారం కానుంది. దీంతో పాటూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో (Disney+ Hot star) కూడా మ్యాచ్‌ను చూడొచ్చు.